News November 20, 2025

హనుమాన్ చాలీసా భావం – 15

image

యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే ||
యముడు, కుబేరుడు, దిక్పాలకులు వంటి దేవుళ్లే హనుమాన్ కీర్తిని సంపూర్ణంగా వర్ణించలేకపోయారు. సామాన్య కవులైతే అసలే వర్ణించలేని గొప్ప పరాక్రమవంతుడు ఆయన. మారుతీ శక్తిని కొలవడానికి మన ఆలోచనలు, పదాలు సరిపోవు. ఆయణ్ను ఎంత కీర్తించినా తక్కువే. అంతటి మహా వీరుడ్ని తలచకుంటే తప్పకుండా ఆయన వెంట ఉండి, కాపాడుతాడని నమ్మకం. <<-se>>#HANUMANCHALISA<<>>

Similar News

News January 18, 2026

కామారెడ్డి: మున్సిపల్ టికెట్ల రేసులో ‘యువ’ గళం!

image

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఆసక్తికరంగా మారింది. సీనియారిటీ కంటే యువత, విద్యావంతుల వైపే రాజకీయ పార్టీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటడం, రిజర్వేషన్లతో మహిళల వాటా పెరగడంతో ఈసారి మున్సిపల్ పగ్గాలు కొత్త తరం చేతికి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

News January 18, 2026

HEADLINES

image

* వందేభారత్ స్లీపర్ ప్రారంభించిన PM మోదీ
* బెంగాల్‌లో బీజేపీ రావాలి: PM మోదీ
* ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కే తొలి ప్రాధాన్యం: TG CM రేవంత్
* ప్రధాని అండతో అభివృద్ధిలో ముందుకెళ్తాం: AP CM CBN
* AP కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన
* రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు: KTR
* తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు
* JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల

News January 18, 2026

భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారో తెలుసా?

image

ప్రపంచంలోనే ఎక్కువ సవరణలు జరిగింది భారత రాజ్యాంగంలోనే. 1949, NOV 26న రాజ్యాంగ సభ ఆమోదం పొంది 1950, JAN 26న అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటివరకు 106సార్లు సవరణలు చేశారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడాన్ని తప్పనిసరి చేస్తూ 2023 SEPలో చివరిగా సవరించారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల డీలిమిటేషన్స్‌ పూర్తైన తర్వాత రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.