News December 2, 2025
హన్మకొండలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు

హన్మకొండ జిల్లాలో బుధవారం నుంచి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లోని 68 గ్రామ పంచాయతీలు, 634వార్డు స్థానాలకు క్లస్టర్ కార్యాలయాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు మూడు రోజులు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.
Similar News
News February 13, 2026
మున్సిపల్ పోరు: రెండో రౌండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..!

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. భైంసాలో ఎంఐఎం, స్వతంత్రులు ఆధిపత్యం చాటుతూ ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తుండగా.. నిర్మల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లు హోరాహోరీ సాగుతోంది. మొదటి రౌండ్ ముగిసేసరికి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అందరి కళ్లు రెండో రౌండ్ ఫలితాలపైనే ఉన్నాయి. తుది ఫలితాలు ఎవరి తలరాతను మారుస్తాయో వేచి చూడాలి.
News February 13, 2026
హైకోర్టులో పేర్ని నానికి చుక్కెదురు.!

మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో చుక్కెదురైంది. సీఎం, డిప్యూటీ సీఎంలను దూషించారంటూ మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌లో నానిపై నమోదైన కేసులో పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నమోదైన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్షకు సంబంధించినవి కావడంతో క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది.
News February 13, 2026
BREAKING: లక్షెట్టిపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 15 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


