News April 14, 2024
హామీలను అమలు చేసే శ్రద్ధ ఆ పార్టీకి లేదు: ఎంపీ అర్వింద్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేసే శ్రద్ధ ఆ పార్టీకి లేదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలను మోసం చేసిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని, రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ హామీలను మరిచిపోయారని మండిపడ్డారు.
Similar News
News December 8, 2025
నిజామాబాద్ జిల్లాలో 8.4°C అత్యల్ప ఉష్ణోగ్రత

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో కోటగిరి 8.4°C, సాలూర 8.8, చిన్న మావంది 9.1, పొతంగల్ 9.2, జకోరా 9.2, డిచ్‌పల్లి 9.7, కల్దుర్కి 9.9°C ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎల్లో అలర్ట్‌లో గన్నారం, మోస్రా, గోపన్న పల్లి, మదన్ పల్లి, నిజామాబాద్ నార్త్ 10.1°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
News December 8, 2025
NZB: సీనియర్ నేషనల్ ఆర్చరీ టోర్నీకి టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్ మురళీ జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా నియమితులయ్యారు. ఈనెల 10 నుంచి 19 వరకు హైదరాబాద్‌లోని బేగంపేట HPSలో నిర్వహించనున్న 42వ సీనియర్ నేషనల్ ఆర్చరీ పోటీలకు ఆయన టెక్నికల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నియామక పత్రాన్ని విడుదల చేశారు.