News November 5, 2025
హాస్టల్ ఘటనపై తిరుపతి కలెక్టర్ సీరియస్

తిరుపతి వెల్ఫేర్ హాస్టల్ <<18201992>>ఘటనలో <<>>వాచ్‌మెన్ హరి గోపాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఇప్పటికే అతడిని సస్పెండ్ చేయగా.. ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ముని శంకర్ పర్యవేక్షణ లోపం ఉండటంతో ఆయనను సైతం సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్యామసుందర్ రావుకు ఛార్జ్ మెమో జారీ చేశారు.
Similar News
News January 20, 2026
లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఎప్పుడంటే..?

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గంగమ్మ జాతర జరగనుంది. దీనికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతర నిర్వాహకులకు మంగళవారం సూచించారు. గ్రామంలో జరిగిన గంగమ్మ పార్వేట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.
News January 20, 2026
నిర్మల్: దివ్యాంగులు దరఖాస్తు చేసుకోండి

2024–25 సంవత్సరానికి నిర్మల్ జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి తెలిపారు. ఈ నెల 30 వరకు https://tgobmms.cgg.gov.inలో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
News January 20, 2026
రాష్ట్రంలో 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ డిస్ట్రిక్ కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr. అసిస్టెంట్, ఎగ్జామినర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, ఏడో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tshc.gov.in


