News August 13, 2025
హిందూపురం జిల్లా కేంద్రంగా మారనుందా?

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జిల్లాల సంఖ్య పెంపుతోపాటు పలు జిల్లా కేంద్రాలను మార్చే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని చేయాలన్న డిమాండ్ ఉండటంతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే రాప్తాడు నియోజకవర్గం మొత్తాన్ని అనంతపురం జిల్లాలో కలిపే అవకాశమున్నట్లు సమాచారం. దీనిపై నెల రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.
Similar News
News March 16, 2026
నర్మెట్ట: పీహెచ్‌సీ, కేజీబీవీను తనిఖీ చేసిన కలెక్టర్

నర్మెట్ట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో మందుల నిల్వలు, ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలించిన కలెక్టర్, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి వంట గదిని, సరకుల నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.
News March 16, 2026
NLG: 22 నుంచి ఖాతాల్లోకి ‘భరోసా’.. పాస్ బుక్ ఉంటే చాలు..!

యాసంగి సాగుకు సంబంధించి ‘రైతు భరోసా’ నిధులను ఈ నెల 22 నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లాలోని 10.50 లక్షల మంది రైతులకు భారీ ఊరట లభించనుంది. ప్రభుత్వం తొలుత సాగులో ఉన్న భూములకే సాయం అందించాలని భావించినా, రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు సాగులో ఉన్నా లేకున్నా, పట్టాదారు పాస్ బుక్ కలిగిన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందనుంది.
News March 16, 2026
ఆసుపత్రిలో చేరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

TG రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ HYDలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మంత్రి వైరల్ జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల నిశిత పర్యవేక్షణలో ఉన్నారు. జ్వరం నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు అడ్లూరి లక్ష్మణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో SC, ST సంక్షేమ కార్యక్రమాలను వివరించే బాధ్యతను మంత్రికి అప్పగించారు.


