News February 9, 2025
హిందూపురం విద్యార్థుల ప్రతిభ

హిందూపురం పట్టణంలోని డీబీ కాలనీ అబాకస్ కాన్సెప్ట్ కేంద్ర విద్యార్థులు కిడ్స్ కాన్సెప్ట్ జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బెంగళూరులో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో 31 మంది పాల్గొనగా.. అందులో 25 మందికి జాతీయస్థాయి బహుమతులు వచ్చాయి. జాతీయస్థాయి కిడ్స్ కాన్సెప్ట్ పోటీల నిర్వాహకులు సచిన్ రావు నుంచి అబాకస్ కేంద్ర నిర్వాహకురాలు శృతి రేచల్ బెస్ట్ ఫ్రాంచెస్ అవార్డు అందుకున్నారు.
Similar News
News February 13, 2026
తిరుపతి: అనాధికారిక డీకేటీ ఇళ్ల పన్ను మార్పులపై ఫిర్యాదు

తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 190 డీకేటీ ఇళ్లకు సంబంధించి వెబ్ సైట్ ద్వారా అనాధికారికంగా పన్ను మార్చారు. గడిచిన రెండేళ్లుగా డీకేటీ పన్ను మార్పు చేయడం లేదు. దీంతో కొందరు దొడ్డిదారిన ఈ పని చేసినట్లు డీసీ గుర్తించి కమిషనర్ మౌర్య దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై శుక్రవారం ఎస్పీకి రాతపూర్వకంగా ఏ ULR నుంచి మార్పు చేశారు. ఎవరు మార్చుకున్నారో విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
News February 13, 2026
మున్సిపాలిటీలపై ‘హస్తం’

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది.
➤ మున్సిపాలిటీలు..
* కాంగ్రెస్ – 64
* బీఆర్ఎస్ – 15
* హంగ్ – 36
* ఇతరులు – 1, * బీజేపీ – 0
➤ వార్డులు * కాంగ్రెస్ – 1346, బీఆర్ఎస్ – 723, బీజేపీ – 261, ఇతరులు – 252
News February 13, 2026
బంగ్లాలో అధికారంలోకి BNP.. భారత్‌కు తొలి అభ్యర్థన!

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ PM హసీనాను అప్పగించమని కోరతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP ప్రకటించింది. ఇప్పటికే ఆ మేరకు అభ్యర్థనలు పంపిన విషయాన్ని గుర్తు చేసింది. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, విదేశాంగ శాఖల స్థాయిలో దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది. 2024 ఆగస్టులో భారత్‌కు వచ్చిన హసీనాకు బంగ్లాలోని ICJ కోర్టు మరణశిక్ష విధించింది.


