News February 20, 2025
హిజ్రాలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

తెలంగాణ ట్రాన్స్‌జెండర్, హిజ్రా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బాగ్‌లింగంపల్లిలో శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. టీపీఏస్‌కే రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అత్యంత వివక్షకు గురైన ట్రాన్స్‌జెండర్స్‌కు బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపించాయని వెంటనే మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి వీడదీసి ప్రత్యేకంగా ట్రాన్సెజెండర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News March 16, 2025
మహిళల ఆరోగ్యమే సమాజానికి ఆరోగ్యం: మంత్రి జూపల్లి

మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవోదయ కాలనీలోని (కూకట్‌పల్లి) తులసివనం వద్ద 5K రన్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు కుటుంబంతో పాటు తమ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News March 16, 2025
సికింద్రాబాద్: అగ్నివీర్ దరఖాస్తులు.. కీలక సూచన

భారత సైన్యంలో సేవలందించేందుకు అగ్ని వీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 10 ఆఖరు తేది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు అభ్యర్థులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయానికి (040 27740059)కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. SHARE IT
News March 16, 2025
HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.