News March 10, 2025
హిట్ లిస్టులో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి: మంప ఎస్ఐ

కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో, హిట్ లిస్టులో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ కే.శంకరరావు సూచించారు. ఈమేరకు మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న రాజకీయ నాయకులతో పాటు పలువురికి నోటీసులు జారీ చేశారు. వారిని మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. వారు మారుమూల గ్రామాలకు వెళ్లాల్సి వస్తే తప్పక సమాచారం అందించాలని కోరారు.
Similar News
News January 17, 2026
శ్రీనివాసుడికి శనివారం ఎందుకు ప్రీతికరమైనది?

వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైన రోజు. ఓంకారం ప్రభవించిన, స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న, ఆలయ ప్రవేశం చేసిన రోజు కూడా శనివారమే. తన భక్తులను పీడించనని శనిదేవుడు శ్రీనివాసుడికి మాట ఇచ్చింది కూడా ఈ రోజే. అందుకే 7 శనివారాలు నియమంతో స్వామిని పూజించి, 7 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. స్వామివారికి శనివారంతో ఉన్న ఈ అనుబంధం వల్లే భక్తులు శనివారాలు ఉపవాసాలు ఉంటారు.
News January 17, 2026
మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు లక్షణాలు

మొక్కజొన్నలో పూత దశ తర్వాత నేలలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల బొగ్గు కుళ్లు తెగులు కనిపిస్తుంది. నేలలోని శిలీంధ్రం మొక్కల వేర్ల ద్వారా కాండం పైభాగానికి వ్యాపించి గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వల్ల పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. ఇలాంటి మొక్కలను చీల్చి చూసినపుడు లోపల బెండు భాగం కుళ్లి, తెలుపు రంగు నుంచి నలుపు రంగుకు మారడం గమనించవచ్చు.
News January 17, 2026
కామారెడ్డి: కొండెక్కిన చికెన్ ధర

కామారెడ్డి జిల్లా మార్కెట్‌లో నాన్-వెజ్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈరోజు స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.302కు చేరి సామాన్యులకు షాకివ్వగా.. కోడి గుడ్డు హోల్‌సేల్ ధర రూ.5.80 పైసలుగా నమోదైంది. దీంతో రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 వరకు విక్రయిస్తున్నారు. పండుగ డిమాండ్, వారాంతం కావడంతో చికెన్, గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.


