News August 27, 2024
హిరమండలం: వంశధార కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

హిరమండలం మైత్రీ కాలనీకి చెందిన జోగి దుర్గాప్రసాద్ అనే యువకుడు వంశధార కుడి ప్రధాన కాలువలో దూకిగా సంఘటనలో మంగళవారం ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది. స్థానిక ఎస్సై నారాయణస్వామి మాట్లాడుతూ.. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్‌ను తల్లి సావిత్రమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు సోమవారం కాలువలో దూకాడు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.
Similar News
News January 19, 2026
టెక్కలి: ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపిక

టెక్కలి మండలం శాసనం గ్రామానికి చెందిన కె.జ్ఞానేశ్వరరావు అనే యువకుడు ఒకేసారి మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇండియన్ ఆర్మీ(టెక్నీకల్), SSC(CISF-GD), ఇండియన్ ఎయిర్ ఫోర్స్(అగ్నివీర్) ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. యువకుడు తండ్రి సాంబమూర్తి రైతు కాగా తల్లి వరలక్ష్మీ గృహిణి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఒకేసారి మూడు కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు సాధించడంపై యువకుడిని పలువురు ప్రశంసించారు.
News January 19, 2026
టెక్కలి: తాపీ మేస్త్రి కుమారుడికి రెండు ఉద్యోగాలు

టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ దీపావళిపేట గ్రామానికి చెందిన కె.సాయి కుమార్ ఒకేసారి రెండు సైనిక ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. SSC(GD-ITBP), ఆర్మీ(అగ్నివీర్) టెక్నీషియన్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాడు. యువకుడి తండ్రి బైరాగి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నారు. పేద యువకుడు ఒకేసారి సైన్యంలో రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంపై గ్రామస్థులు, స్నేహితులు అభినందించారు.
News January 19, 2026
అరగంటలోనే సూర్య భగవానుడి దర్శనం: SKLM కలెక్టర్

రథసప్తమి పర్వదినాన అరసవల్లికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గతంలో 45 నిమిషాలు పట్టే దర్శన సమయాన్ని ఈసారి 30 నిమిషాలకే తగ్గించేలా 6 ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. ఉచితంతోపాటు రూ.100, రూ.300,రూ.500 టికెట్లు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు రావచ్చన్నారు.


