News March 31, 2025
హుజుర్‌నగర్‌కు అగ్రికల్చరల్ కళాశాల సీఎం ప్రకటన

హుజుర్‌నగర్ పట్టణానికి సన్న బియ్యం పథకం ప్రారంభానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బియ్యం పథకం ప్రారంభించడం అనంతరం సమ భావన సంఘ మహిళలకు రూ.26 కోట్ల 16లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ తన ప్రసంగంలో హుజుర్‌నగర్‌కు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయాలని కోరగా స్పందించిన సీఎం తన ప్రసంగంలో కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News April 18, 2025
గద్వాల: రామకృష్ణ మృతి.. ట్రాన్స్‌జెండర్, మరో వ్యక్తి రిమాండ్

గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రానికి చెందిన రామకృష్ణ ఐదు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతడి మృతిపై పలు అనుమానాలున్నాయని పేర్కొంటూ, ట్రాన్స్‌జెండర్ శివానితో పాటు మరో ముగ్గురిపై భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మల్దకల్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. గురువారం ట్రాన్స్‌జెండర్ శివాని, రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
News April 18, 2025
అరుదైన ఘనత సాధించిన హెడ్

IPL: వాంఖడేలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. మొత్తంగా 575 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో రస్సెల్(545), హెడ్ తర్వాత క్లాసెన్(594), సెహ్వాగ్(604), మ్యాక్స్‌వెల్(610), యూసుఫ్ పఠాన్(617), నరైన్(617) ఉన్నారు.
News April 18, 2025
ADB: రాష్ట్ర మంత్రి పర్యటన షెడ్యూల్ ఇదే

ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు స్థానిక ఇంద్ర ప్రియదర్శిని స్టేడియంలో హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 2:00 గంటలకు భోరజ్ మండలం పూసాయిలో నిర్వహించనున్న భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 4:00 గంటలకు మావలలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.