News April 21, 2024
హుజూరాబాద్: అమెరికాలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన ముక్క నివేశ్ (20) అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు మృతుడి తల్లిదండ్రులు నవీన్-జ్యోతి తెలిపారు. కళాశాలకు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదంలో నివేశ్‌తో పాటు అతడి స్నేహితుడు గౌతమ్ కూడా మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News December 14, 2025
లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్‌గా నీలం చంద్రారెడ్డి గెలుపు

తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం చంద్రారెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి కరివేద శ్యాంసుందర్ రెడ్డిపై 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప మెజార్టీతో గెలుపొందిన చంద్రారెడ్డికి గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారు గెలుపొందడంతో లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
News December 14, 2025
కరీంనగర్ జిల్లాలో 84.63% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 84.63% పోలింగ్ కాగా, చిగురుమామిడిలో 85.82%. గన్నేరువరంలో 88.55%, మానకొండూరులో 82.34%, శంకరపట్నంలో 84.98%, తిమ్మాపూర్ లో 84.83% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 185003 ఓట్లకు గాను 156568 ఓట్లు పోలయ్యాయి.
News December 14, 2025
రామకృష్ణ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామ కృష్ణ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ పర్సంటేజ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడ జిల్లా అధికారులు, మండల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


