News April 28, 2024

హుజూర్‌నగర్: వడదెబ్బతో వృద్ధుడు మృతి

image

హుజూర్‌నగర్: ఎండల తీవ్రత పెరిగిపోయిన క్రమంలో స్థానిక 13వ వార్డులో వృద్ధుడు వడదెబ్బ తగిలి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 13వ వార్డులో నివాసం ఉంటున్న ధార అంజయ్య (70 ) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వడదెబ్బ తగలడంతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Similar News

News July 10, 2025

NLG: పదోన్నతులకు కసరత్తు.. 49 మందికి ఛాన్స్!

image

జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులకు మరోసారి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఖాళీ అయిన పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ HMగా పదోన్నతి కల్పించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆయా కేటగిరీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బుధవారం విద్యాశాఖ కార్యాలయంలో పూర్తి చేశారు. 49 మందికి పదోన్నతి కల్పించే అవకాశాలు ఉన్నాయి.

News July 9, 2025

నల్గొండ: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య

image

కనగల్‌కి చెందిన కౌలు రైతు గోనెల చిన్న యాదయ్య (45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఎస్.రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాదయ్య తనకున్న కొద్దిపాటి భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావటంతో ఇవాళ మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

News July 9, 2025

NLG: తాడిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

కేతేపల్లి మండలం చీకటిగూడెంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు జానయ్య ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడ్డాడు. ఈ క్రమంలో మోకు మెడకు చుట్టుకోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. జానయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిది పేద కుటుంబమని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతదేహాన్ని నకిరేకల్ మార్చురీకి తరలించారు.