News June 19, 2024

హుస్నాబాద్‌లో హత్య UPDATE

image

హుస్నాబాద్(M) కూచన్‌పల్లి వాసి నరసయ్య(55)ను <<13461790>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. SI మహేశ్ వివరాలు.. నర్సయ్య సామగ్రి ఏరుకుంటూ విక్రయించేవాడు. మద్యానికి బానిసై రోజు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి అతని భార్య లేచి చూసేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి నర్సయ్య భార్య, తమ్ముడి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 15, 2026

మెదక్: రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల్లో టెన్షన్!

image

మెదక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. తమ స్థానం ఏ రిజర్వేషన్‌కు కేటాయిస్తారోనని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి పుర పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. రిజర్వేషన్ల లెక్కలను బట్టి అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

News January 14, 2026

మెదక్: యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 10వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్‌కు దూరం, తాగునీటి సౌకర్యం, ర్యాంపులు, ఇతర ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

News January 14, 2026

జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

image

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.