News December 1, 2025

హుస్నాబాద్: ‘మా ఓటు విలువైనది.. అమ్మబడదు’

image

హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన భోజ అనిల్ కుమార్ ఫ్యామిలీ తమ ఇంటి ముందు ‘ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు- ఆ ఓటును మేము అమ్ముకోము’ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వారు చేసిన ఈ పనిని చూసి అందరూ సూపర్బ్ అంటున్నారు. ఓట్లు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని వారు అంటున్నారు.

Similar News

News February 13, 2026

తూర్పు దిశలో ఇల్లు కట్టుకుంటే?

image

తూర్పు దిక్కు ఇంటికి చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల లక్ష్మీ, సరస్వతుల కటాక్షం లభిస్తాయని అంటున్నారు. ‘ఇది సూర్యుడు ఉదయించే దిశ. అందువల్ల ఇక్కడ ఉండేవారు ఆరోగ్యవంతులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. ఈ దిశకు అధిపతి ఇంద్రుడు. తద్వారా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలుంటాయి. వాస్తు నియమాలు పాటిస్తే ఆశయాలు నెరవేరి సంతృప్తికర జీవితం గడుపుతారు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 13, 2026

NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

image

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్‌లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్‌లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు.

News February 13, 2026

శ్రీకాళహస్తీశ్వరునికి కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు సమర్పణ

image

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరఫున శుక్రవారం పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు. కనకదుర్గమ్మ ఆలయం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బుర్ర రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు, ఆలయ ఈఓ శినా నాయక్, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ EO T. బాపిరెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడ ఆలయ అధికారులకు ఆలయ మర్యాదలతో సత్కరించారు.