News December 3, 2025
హుస్నాబాద్: రూ.262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో రూ.262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.44.12 కోట్లు, R&Bకి రూ.58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్‌కు రూ.8.5 కోట్లు, ఐటీఐకి రూ.45.15 కోట్లు, R&Bకి రూ.86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News February 15, 2026
‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత మృతి.. అనుమానాలు?

TG: యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న అతడు ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ మరణించగా, డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పరారైనట్లు మత్స్యకారులు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ గతంలో ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో చర్చనీయాంశంగా మారారు.
News February 15, 2026
వర్ధన్నపేట ఛైర్మన్ ఎంపిక ఆమె చేతిలోనే!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పురపాలిక ఛైర్మన్ ఎంపిక ఆమె చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్‌కు 5 స్థానాలు రాగా, బీఆర్ఎస్‌కు 6 స్థానాలు వచ్చాయి. ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్‌కు ఆరు స్థానాలు ఉండగా, స్వతంత్ర అభ్యర్థి శిబారాణి ఎటువైపు వెళ్తే అటే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికయ్యే స్పష్టత కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ క్యాంపులోనే శిబారాణి ఉన్నట్లుగా తెలుస్తుండగా, చివరి నిమిషంలో ఏం జరుగుతుందో ఉత్కంఠ నెలకొంది.
News February 15, 2026
CNF అంటే ఏంటో తెలుసా?

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It


