News December 3, 2025
హుస్నాబాద్: రూ.262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో రూ.262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.44.12 కోట్లు, R&Bకి రూ.58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్‌కు రూ.8.5 కోట్లు, ఐటీఐకి రూ.45.15 కోట్లు, R&Bకి రూ.86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News February 16, 2026
నంద్యాల: గాజులపల్లి టన్నెల్ పూర్తి

రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది. గజూలపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక భారీ మైలురాయిగా నిలవనుంది.
News February 16, 2026
తొర్రూరు, జనగామలకు అబ్జర్వర్ల నియామకం

తొర్రూరు, జనగామ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇందుకు ప్రత్యేక అబ్జర్వర్లను నియమించారు. తొర్రూరు బాధ్యతలను ఎంపీ రఘురాంరెడ్డి, MLAలు రాజేందర్ రెడ్డి, నాగరాజులకు అప్పగించగా, జనగామ ఇన్‌ఛార్జులుగా MLAలు బీర్ల ఐలయ్య, గండ్ర సత్యనారాయణరావును నియమించారు. రేపు జరగనున్న ఎన్నికల ప్రక్రియను వీరు పర్యవేక్షించనున్నారు.
News February 16, 2026
ప్రపంచానికే పరిష్కారాలు చూపుతాం: మోదీ

ఢిల్లీ కేంద్రంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆవిష్కర్తలు, పరిశోధకులు, ఔత్సాహికుల మధ్య ఉండటంవల్ల భారతీయ ప్రతిభ, ఏఐ సామర్థ్యం గురించి అవగాహన కలుగుతోంది. అందరం కలిసి మన దేశానికే కాకుండా అనేక సమస్యలపై ప్రపంచానికే పరిష్కారాలను చూపుతాం’ అని రాసుకొచ్చారు.


