News December 3, 2025

హుస్నాబాద్: రూ.262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

image

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో రూ.262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.44.12 కోట్లు, R&Bకి రూ.58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్‌కు రూ.8.5 కోట్లు, ఐటీఐకి రూ.45.15 కోట్లు, R&Bకి రూ.86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Similar News

News February 13, 2026

కౌంటింగ్ కేంద్రాల్లోకి ఈ వస్తువులు నిషేధం: కామారెడ్డి SP

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలని కామారెడ్డి SP రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే వారు అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు కారణమయ్యే వస్తువులు తీసుకురాకూడదని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ సిబ్బందికి అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.

News February 13, 2026

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. లీడ్‌లో BNP!

image

బంగ్లాదేశ్‌లో 299 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 55% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. వెంటనే కౌంటింగ్ షురూ చేయగా ఇంకా కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(BNP) లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పోటీదారు జమాత్ ఇస్లామీ పార్టీకి ఓటర్ల మద్దతు తగ్గినట్లు సమాచారం. మరోవైపు BNP ఛైర్‌పర్సన్, ప్రధాని అభ్యర్థి రెహ్మాన్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

News February 13, 2026

MDK: అనుమతి పత్రం ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి: ఎస్పీ

image

మెదక్ మున్సిపాలిటీ కౌంటింగ్ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో వెస్లీ కళాశాలలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు సమీక్షించారు. అనుమతి పత్రాలు ఉన్నవారికే ప్రవేశం, కఠిన తనిఖీలు, మొబైల్ ఫోన్ల నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. BNSS 163 అమలులో ఉంటుందని, గుంపులు, ర్యాలీలు, డీజేలు నిషేధమన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.