News December 3, 2025
హుస్నాబాద్: రూ.262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో రూ.262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.44.12 కోట్లు, R&Bకి రూ.58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్‌కు రూ.8.5 కోట్లు, ఐటీఐకి రూ.45.15 కోట్లు, R&Bకి రూ.86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News February 18, 2026
ADB: బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

ఐటీఐ 2 సంవత్సరాల కోర్సులో పాసైన విద్యార్థుల నుంచి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 21లోపు సర్టిఫికెట్‌లతో కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 60% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్ష మార్చి 12న ఉంటుందన్నారు.
News February 18, 2026
వరంగల్ నిట్ ప్రాజెక్ట్ డిజైన్‌కు భారతీయ పేటెంట్

నిట్ వరంగల్ మెకానికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి.రాఘవేంద్ర, వి.సురేష్ బాబు, బీటెక్ విద్యార్థి వలబోజు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రాజెక్టు డిజైన్‌కు పేటెంట్ లభించింది. “స్మార్ట్ ఫంక్షనల్లీ గ్రేడెడ్ మెటీరియల్” అనే డిజైన్‌ను భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నమోదు చేసింది. ఇది ఆవిష్కరణ, పరిశోధనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందంటూ నిట్ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
News February 18, 2026
సంగారెడ్డి: ఓటర్ల సర్వేలో వేగం పెంచాలి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 51.96 శాతం సర్వే మాత్రమే పూర్తయిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పురోగతి తక్కువగా ఉందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా సవరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.


