News December 3, 2025
హుస్నాబాద్: రూ.262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో రూ.262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.44.12 కోట్లు, R&Bకి రూ.58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్‌కు రూ.8.5 కోట్లు, ఐటీఐకి రూ.45.15 కోట్లు, R&Bకి రూ.86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News February 13, 2026
మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, BP, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, ఫ్రూట్స్, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News February 13, 2026
గజపతినగరం: హాస్టల్ రూములో విద్యార్థి ఆత్మహత్య..!

గజపతినగరంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి గురువారం రాత్రి మృతి చెందాడు. మెరకముడిదాం (M) ఊటపల్లి గ్రామానికి చెందిన రాజేశ్ నిన్న సాయంత్రం స్టడీ అవర్స్ అయిన వెంటనే తన గదిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి అపస్మారక స్థితిలో ఉన్న రాజేశ్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే విద్యార్థి మెడపై ఉరివేసుకున్నట్లు ఉన్న ఆనవాలను పోలీసులు గుర్తించారు.
News February 13, 2026
నిర్మల్: LOVE FAILURE.. ఇంటర్ విద్యార్థిని సూసైడ్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక భైంసాలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రమేశ్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


