News November 8, 2025

హెలికాప్టర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకునే విధానాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. పిల్లల భవిష్యత్తు గురించి విపరీతమైన ఆందోళన చెందుతారు. ప్రతి సమస్య నుండి తమ బిడ్డను రక్షించడానికి సాయం చేయాలనుకుంటారు. అయితే వారి మితిమీరిన జోక్యం భవిష్యత్తులో పిల్లలకి సమస్యగా మారుతుందంటున్నారు నిపుణులు. పిల్లలను ఎదగనివ్వాలని, వారిని సొంతంగా నిర్ణయాలు తీసుకొనేలా ప్రోత్సహించాలని వారు చెబుతున్నారు.

Similar News

News January 23, 2026

NLG: రా మెటీరియల్ సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

image

అనుముల, డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల(ITI)లకు రా మెటీరియల్ సరఫరా చేసేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ ITI ప్రిన్సిపల్ తెలిపారు. సుమారు రూ.31,93,200 వ్యయంతో ఈ ముడి సరుకులను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన సరఫరాదారులు టెండర్ ఫారాలు, పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News January 23, 2026

INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

image

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

News January 23, 2026

‘MSVPG’కి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి: HC

image

TG: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి వాస్తవ లెక్కలను సమర్పించాలని GST అధికారులను హైకోర్టు ఆదేశించింది. చట్టవిరుద్ధంగా టికెట్ ధరలను పెంచారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రూ.45 కోట్లు అక్రమంగా సంపాదించారని, వాటిని రికవరీ చేయాలని పిటిషనర్ శ్రీనివాస రెడ్డి కోరారు. కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.