News October 8, 2025
హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి: ADB కలెక్టర్

నామినేషన్లను నిబంధనలకు అనుగుణంగా సరైన పద్ధతిలో సమర్పించేలా అభ్యర్థులకు సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆర్ఓ, ఏఆర్ఓల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జెడ్పీ సీఈఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియను నిర్వహించుకోవాలని, దీనివల్ల తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్త పడవచ్చన్నారు.
Similar News
News January 23, 2026
అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించిన ఆయన, విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందాల్సిన పరిహారాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News January 22, 2026
ADB: ఆదివాసీ యువతకు డ్రైవింగ్ లైసెన్స్‌లు

ప్రత్యేకంగా ఆదివాసీ యువతకు డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేయాలనే ఉద్దేశంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 5 మండలాల యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ మేళా ప్రారంభించారు. ఆదిలాబాద్ ఆర్టీవో కార్యాలయంలో పలువురికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. నార్నూర్, గాదిగూడ, సిరికొండ, బజార్హత్నుర్, భీంపూర్ మండలాల్లోని 400 మంది యువకులకు మొదటి విడతలో భాగంగా లర్నింగ్ లైసెన్స్ అందజేశారు.
News January 22, 2026
ఇంద్రవెల్లి: ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కృషి

గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, ఆర్‌ఓఎఫ్ఆర్ పట్టాల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందని పీవో యువరాజ్ తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యా, వైద్యం, రవాణా సౌకర్యం వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆదివాసీల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని, తండాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.


