News August 20, 2025

హైకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కెదురు

image

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు, పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Similar News

News January 18, 2026

బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN

image

AP: రాజకీయాలు చేయడం అంటే బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదని CM చంద్రబాబు అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నది NDA ప్రభుత్వం, CBN అని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. TDP కుటుంబ సభ్యుల కృషితోనే తాను సీఎం అయ్యానని తెలిపారు. అధికారం కోసం ఏనాడు ఆరాటపడలేదన్నారు. గొంతు మీద కత్తి పెట్టి TDPని విడిచిపెట్టమంటే ప్రాణాలు వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారని NTR 30వ వర్ధంతి కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

News January 18, 2026

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

News January 18, 2026

VJA: మైనర్‌తో గులకరాయి నిందితుడి ప్రేమాయణం..!

image

వైసీపీ అధినేత జగన్‌పై గతంలో గులకరాయి దాడి చేసిన కేసులో నిందితుడు వేమూరి సతీశ్ కుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన ఇతను ఓ మైనర్ బాలికను ప్రేమించి, పెళ్లి చేయాలంటూ శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బాలిక వయసు రీత్యా మైనర్ కావడంతో పోలీసులు సతీశ్‌‌పై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో అతడిని జైలుకు తరలించారు.