News October 7, 2025

హైకోర్టు తీర్పుతోనే వైన్స్ టెండర్ల దాఖలులో కదలిక!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తులు పెద్దగా రావడం లేదు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, వైన్ షాపుల లైసెన్స్ టెండర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రకటనలు దాదాపు ఒకేసారి రావడంతో మద్యం టెండర్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో కేసు నమోదు కావడం, ఇదే అంశంపై ఈ నెల 8న హైకోర్టులో విచారణ ఉండటంతో టెన్షన్ నెలకొంది.

Similar News

News January 25, 2026

సంగారెడ్డి: పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

image

సంగారెడ్డి జిల్లాలో వివిధ దాడుల్లో పట్టుబడిన అక్రమ పీడీఎస్ బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గోదాముల్లో నిల్వ ఉన్న ఈ సరుకును “యథాతథం” పద్ధతిలో విక్రయించనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన బీవరేజెస్, డిస్టిలరీ సంస్థల నుండి సీల్డ్ కొటేషన్లను ఆహ్వానించారు. ఆసక్తి గల వారు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News January 25, 2026

ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్

image

WPL-2026లో ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్ వేసింది. ఇవాళ జరిగిన మ్యాచులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు విఫలమైనా లారా(42*), రోడ్రిగ్స్(24), కాప్(19*) రాణించడంతో విజయం సొంతమైంది. ఈ గెలుపుతో DC పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. తొలి స్థానంలో ఆర్సీబీ(10P) ఉంది.

News January 25, 2026

ఆకర్షణీయంగా ముస్తాబైన తిరుపతి కలెక్టరేట్

image

గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకల సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ త్రివర్ణ విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా ముస్తాబైంది. రాత్రి వేళల్లో కలెక్టరేట్ భవనం నలువైపులా ఈ మూడు రంగుల విద్యుత్ దీపాలతో కాంతులు విరజిమ్ముతూ అత్యంత సుందరంగా, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.