News September 14, 2024
‘హైడ్రా’ కూల్చివేతలపై హైకోర్టుకు కాటసాని భార్య
TS అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టును ఆశ్రయించారు. FTL పరిధిలో లేకున్నా వ్యవసాయ భూమిలోని షెడ్, కాంపౌండ్‌ను కూల్చివేశారని తెలిపారు. 9ఎకరాల భూమిలో దానిమ్మ, మామిడి, జామ వంటి మొక్కలు పెంచుతున్నామని, కాంపౌండ్ నిర్మాణానికి అనుమతివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. అనంతరం విచారణను అక్టోబరు 3కు వాయిదా వేశారు.
Similar News
News October 3, 2024
గ్రామపంచాయతీలో రైతుబజార్ల ఏర్పాటు: కలెక్టర్
RIDF, నాబార్డ్ గ్రాంట్ కింద గ్రామపంచాయతీలో రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో RIDF, నాబార్డ్ గ్రాంట్ బేస్డ్ ప్రాజెక్టుల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నాబార్డ్ గ్రాంట్ కింద జీవనోపాదుల కల్పనకు విరివిగా అవకాశాలున్నాయని, సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
News October 3, 2024
ఉపాధి హామీ పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: కలెక్టర్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జీ.రాజకుమారి ఎంపీడీవోలు, ఏపీఓలు, క్షేత్రస్థాయి సిబ్బంది ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దినసరి సరాసరి కూలి వేతన చెల్లింపులో దిగువ స్థానంలో ఉన్నామని వేతన కూలి రేటు పెంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు.
News October 3, 2024
సైబర్ నేరాల కట్టడికి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించండి: ఎస్పీ
కర్నూలులోని ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ జీ.బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొరియర్ అని, లాటరీ తగిలిందని, డిజిటల్ అరెస్టు పేరుతో విడియో కాల్స్ చేస్తూ మోసాలు చేస్తున్నాయని, జాగ్రత్త వహించాలన్నారు. సైబర్ నేరం జరిగిన గంటలోపే 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.