News April 25, 2024

హైదరాబాదీలకు రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి

image

హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌ బాధ్యత కాంగ్రెస్ తీసుకొంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్‌లో MP అభ్యర్థి రంజిత్‌ రెడ్డికి మద్దతు‌గా ప్రచారం నిర్వహించారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని సుందరీకరిస్తామని CM హామీ ఇచ్చారు. ఇక్కడి భూముల విలువను పెంచుతామన్నారు. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ MP అభ్యర్థిని పార్లమెంట్‌కు పంపాలని ఓటర్ల‌ను విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 14, 2026

HYD: 8712661212 నం.కు కాల్ చేయండి!

image

హైదరాబాద్ లో మామిడి పండ్లు కుళ్లిపోయినవి, నాణ్యతపై అనుమానం ఉన్నవి విక్రయిస్తే వెంటనే స్పందించాలి. అలాంటి ఘటనలు గమనించిన వినియోగదారులు 87126 61212 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికార యంత్రాంగం సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ H-FAST విభాగం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

News April 14, 2026

HYD: అందమైన అమ్మాయిలతో సంపాదన

image

యువతే వీరి టార్గెట్. అందమైన అమ్మాయిలతో ఆడియో, వీడియో <<19614819>>కాల్స్<<>> అంటూ ఈ యాప్స్ వ్యాపారం చేస్తున్నాయి. వీటి మోజులో పడి యువతి, యువకులు అనేక కేసుల్లో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దోస్త్, కనెక్ట్, ఫ్రెండ్ లాంటి యాప్స్‌పై Gen-S సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. 18- 45 ఏళ్ల మహిళలు ఈ యాప్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని, యువకులు వారితో మాట్లాడటానికి డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నట్లు పేర్కొంది.

News April 14, 2026

HYD: BJPకి క్రైస్తవుల మద్దతు: TG చీఫ్

image

భిన్నత్వంలో ఏకత్వానికి, సర్వమత సామరస్యానికి భారతదేశం గొప్ప ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలో క్రైస్తవులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను విశ్వసిస్తూ కేరళం, గోవా లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయమన్నారు.