News August 27, 2024
హైదరాబాద్‌కు డెంగ్యూ ఫీవర్

HYDలో ‘డెంగ్యూ’ చాపకింద నీరులా విస్తరిస్తోంది. 404 కాలనీల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5 నుంచి 15 వరకు 10 రోజుల్లో GHMC, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. 731 మందికి డెంగ్యూ, ఒకరికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే, 378 మందికి మాత్రమే డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బల్దియా లెక్కలు చెప్పడం గమనార్హం. పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీ కేర్ ఫుల్
SHARE IT
Similar News
News January 23, 2026
HYDలో ఇదో అంతుచిక్కని మొక్క!

గ్రేటర్ పరిధి చెరువులు, కుంటల్లో గుర్రపు డెక్క అంతుచిక్కని సమస్యగా మారింది. గత 12 ఏళ్లుగా ఎన్నో పైలట్ ప్రాజెక్టులు, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టినా ఫలితం లేదు. ఉప్పల్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో గుర్రపు డెక్కను పూర్తిగా చంపేందుకు అంతర్జాతీయ నిపుణులతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినా ఫలితం రాలేదు. చెరువుల్లో అతిపెద్ద సమస్యగా మారిన గుర్రపుడెక్కను అంతంచేసే పరిష్కారమే లేదా? అని అడుగుతున్నారు.
News January 23, 2026
SEC: మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు

సమ్మక్క-సారలమ్మ జాతర భక్తుల రద్దీని దృష్యా SCR 28 అన్‌రిజర్వ్‌డ్ రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు JAN 28 నుంచి FEB 1 వరకు SEC, NZB, ADB, KMM నుంచి వరంగల్, కాజీపేటకు నడవనున్నాయి.
రూట్లు: SEC- మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్- WGL, కాజీపేట- ఖమ్మం, ఆదిలాబాద్- కాజీపేట మధ్య
స్టాపులు: మౌలాలి, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్ వంటి కీలక స్టేషన్లు
టైమింగ్: ఉ.5:45 నుంచి అర్ధరాత్రి వరకు