News August 23, 2025

హైదరాబాద్‌కు ‘HILLS’.. అక్కడ ఇదీ రోడ్ల పరిస్థితి!

image

HYDలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటే తెలియని వారు ఉండరు. భారీ బిల్డింగ్‌లు, కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్ అందాలకు ఈ ఏరియాలు మారుపేరు. ధనికులు ఉండే ప్రాంతంగానూ పేరు పొందింది. కానీ.. ఇప్పుడు బంజరాహిల్స్ లాంటి ప్రాంతాల్లో రహదారులు గుంతల మయంగా మారి, అధ్వాన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది బంజారాహిల్స్ రోడ్ నంబర్- 12 పరిస్థితికి అద్దంపట్టే రోడ్డు ఫొటో.

Similar News

News January 12, 2026

HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

image

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్‌లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్‌పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 12, 2026

HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

image

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్‌లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్‌పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేద వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 12, 2026

మృత్యువును ఆపిన ‘డెలివరీ’ బాయ్‌.. HYDలో సెల్యూట్

image

నిత్యం ట్రాఫిక్‌తో కుస్తీ పట్టే ఓ డెలివరీ బాయ్ మానవత్వంలో అందరికంటే ముందున్నాడు. ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ మహిళ ఆర్డర్ చేసిన విషాన్ని డెలివరీ చేయకుండా ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడాడు. నగరంలోని మీడియా జంక్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఉదంతం చర్చకు రాగా అక్కడి వారంతా లేచి నిలబడి ఆ యువకుడికి సెల్యూట్ చేశారు. ఈ ‘నిజమైన హీరో’ ఇప్పుడు హైదరాబాదీల ప్రశంసలు అందుకుంటున్నాడు.