News September 12, 2025

హైదరాబాద్‌లో అతిపెద్ద ఎగ్జిబిషన్ నవంబర్‌లో

image

భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానుంది. దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్ నవంబర్ 25 నుంచి జరుగనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన దాదాపు 500 మంది ఎగ్జిబిటర్లు, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని పౌల్ట్రీ అసోసియేషన్ నాయకులు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 15, 2025

కాంగ్రెస్ “ఓట్ చోరీ” సభ అట్టర్ ఫ్లాప్: కిషన్ రెడ్డి

image

“ఓట్ చోరీ” పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన <<18562660>>సభ<<>> అట్టర్ ఫ్లాప్ అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘రాహుల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ అంటూ దుష్ప్రచారానికి తెరతీశారన్న విషయం ప్రజలకు అర్థమైంది. కార్యకర్తలను బిజీగా ఉంచుకోవడానికి మాత్రమే ఈ ట్రిక్కులు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ సభ్యులను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

News December 15, 2025

ఒక్క ఓటుతో కొత్తపల్లి సర్పంచ్‌గా గెలిచిన శోభారాణి

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌గా గోదరి శోభారాణి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శోభారాణి తన ప్రత్యర్థి ఎల్కతుర్తి కనకలక్ష్మిపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

News December 15, 2025

వలిగొండలో ఉత్కంఠగా సాగిన కౌంటింగ్.. గెలిచిందెవరంటే?

image

వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకట పాపిరెడ్డి ప్రత్యర్థి BRS బలపరిచిన పలుసం రమేశ్ గౌడ్‌పై 472 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచాలు, మిఠాయిలతో సంబరాలు జరుపుకున్నారు. మొత్తం 7,212 ఓట్లు ఉండగా కాంగ్రెస్, BRS మధ్య నెక్ టూ నెక్ ఫైట్ సాగింది.