News July 31, 2024
హైదరాబాద్‌లో నల్గొండ జిల్లా వివాహిత సూసైడ్
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం కురుమిద్దేకు చెందిన రమావత్ సుజాత(21)కు చింతపల్లి మండలం గాశిరాంతండాకు చెందిన రమావత్ శివ(23)తో 2023 మే 5న వివాహం జరిగింది. భర్త వేధింపులు తాళలేక హయత్ నగర్‌లో నివాసముంటున్న ఇంట్లోనే భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Similar News
News October 8, 2024
లింగాలగూడెంలో క్షుద్ర పూజలు.. భయాందోళనలో గ్రామస్థులు
మండలంలోని లింగాలగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన బొబ్బలి నరసింహ, గన్నేబోయిన వెంకన్న ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన మూటలను ఇళ్లలో పడేసి వెళ్లారు. వాటిని గమనించిన సదరు వ్యక్తులు మూటలు విప్పి చూడగా అందులో పసుపు,కుంకుమ, నిమ్మకాయలు, నవధాన్యాలు, గవ్వలు, జీడిగింజలు, తాటి ఆకు బొమ్మలు బయటపడ్డాయి.
News October 8, 2024
NLG: ఆర్టిఐ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
RTI ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరపత్రం ఆవిష్కరించించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో దుశ్యర్ల సత్యనారాయణ, సైదులు, మేఖల శ్రీహరి, కాడబోయిన సాయి, మల్లయ్య, శంకర్, రాంబాబు పాల్గొన్నారు.
News October 7, 2024
NLG: విషాదం.. కొడుకుకి ఉరేసి తల్లి సూసైడ్.!
యాదాద్రి జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఓ తల్లి కన్న కొడుకుకి ఉరేసి తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దరావులపల్లికి చెందిన జడల సోనీ కొడుకు రియాన్ష్‌కు ఇంట్లో ఉరేసి తాను సూసైడ్ చేసుకుంది. మానసిక గుబులుతో ఆమె ఈఘటనకు పాల్పడినట్లు కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.