News March 24, 2024

హైదరాబాద్‌లో నేటి TOP NEWS

image

> బాలానగర్‌లో యువకుడి దారుణ హత్య
> చంచల్‌గూడ జైలుకు ఫోన్ ట్యాపింగ్ నిందితులు
> మీర్‌పేట్‌లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం
> HYDలో 46,61,000 నగదు పట్టివేత
> గాంధీ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
> మన్సూరాబాద్ పరిది జడ్జెస్ కాలనీలో గోవులపై దుండగులు మత్తు ప్రయోగం
> నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో సంబరాలు
> డీజిల్ తరలిస్తున్న ముఠా గుట్టురట్టు
> తీగుళ్ల పద్మారావు గౌడ్ ఇంటివద్ద కోలాహలం

Similar News

News December 11, 2025

BREAKING: కాంగ్రెస్ సపోర్ట్.. లగచర్లలో సర్పంచ్ ఈయనే!

image

వికారాబాద్ జిల్లాలో ఉత్కంఠను రేపిన లగచర్లలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఘన విజయం సాధించారు. ఇక్కడ గెలిచేందుకు ప్రత్యర్థులు సర్వ శక్తులు ఒడ్డినా.. చివరి నిమిషంలో వెంకట్రాములు గౌడ్ 15 ఓట్ల తేడాతో గెలుపొందారు. BRS బలపరిచిన గుండెమోని బసప్ప ఓటమి చవిచూశారు. దీంతో వెంకట్రాములుకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేశాయి.

News December 11, 2025

వార్డులు.. HYDలో వార్ మొదలు

image

GHMC వార్డులను 150 నుంచి ఏకంగా 300కు పెంచడంతో నగరంలో ఎన్నికల వేడిని రాజేసింది. ఈ నిర్ణయం కాంగ్రెస్-MIM రహస్య ఒప్పందమంటూ BJP తీవ్రస్థాయిలో మండిపడుతోంది. MIM డివిజన్లను 46 నుంచి 90కి పెంచి, కాంగ్రెస్ పరోక్షంగా లబ్ధి పొందుతోందని కమలదళం ధ్వజమెత్తింది. ​GHMC పరిధిలోని 50కి పైగా డివిజన్లలోని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు గాలం వేస్తూ ఎన్నికల వ్యూహాలకు INC పదును పెడుతోంది. అసలు ఆట ఇప్పుడే మొదలైంది.

News December 11, 2025

HYD: బ్యాలెట్ పేపర్ చించేశాడు.. ఓటరుపై కేసు

image

శంషాబాద్‌లో బ్యాలెట్ పత్రాన్ని చింపేసిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని బురుజు గడ్డ తండాలో పోలింగ్ కేంద్రానికి ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బ్యాలెట్ పత్రాన్ని చించి వేశారు. ఈ ఘటనపై ఎలక్షన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక అభ్యర్థికి ఓటు వేయబోయి.. పొరపాటున మరొకరికి తన ఓటు వేశానని పేపర్ చింపివేసినట్లు విచారణలో తేలింది.