News December 2, 2025
హైదరాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ

తెలంగాణ రైజింగ్ విజన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు, వ్యక్తులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన అజయ్ దేవ్‌గణ్ ఫ్యూచర్ సిటీలో తన ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంతో M0U చేసుకోనున్నట్లు సమాచారం.
Similar News
News February 13, 2026
ఉమ్మడి రంగారెడ్డిలో MLAలకు ‘ఇజ్జత్ కా సవాల్’!

నేడు వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్ MLAలకు ఇజ్జత్ కా సవాల్‌గా మారనున్నాయి. కాంగ్రెస్ MLAలు IBP- రంగారెడ్డి, షాద్‌నగర్- శంకర్, కొడంగల్- CM ఇలాకా, వికారాబాద్- స్పీకర్, పరిగి- TRRకి ఈ రిజల్ట్స్ ఛాలెంజ్‌గా మారాయి. మేడ్చల్‌లో మల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరినా, ఆయా చోట్ల గులాబీ జెండా రెపరెపలాడినా వారి కంచుకోటలు బీటలు వారడం ఖాయమని పొలిటికల్ అనలిస్ట్‌ల మాట.
News February 13, 2026
పోస్టల్ బ్యాలెట్.. లీడింగ్‌లో కాంగ్రెస్

TG: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చింది. ఏదులాపురం (ఖమ్మం), మధిర, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. నిర్మల్, ఖానాపూర్, కాగజ్‌నగర్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
News February 13, 2026
ఉప్పాడ హార్బర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కొత్తపల్లి మండలం ఉప్పాడ హార్బర్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. హార్బర్‌లోని రాళ్లగుట్టపై మృతదేహాన్ని గమనించిన మత్స్యకారులు స్థానికులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.


