News March 26, 2024
హైదరాబాద్‌లో యువకుడి దారుణహత్య..!

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. జీడిమెట్ల PS పరిధి సుభాష్‌నగర్ శ్మశానవాటిక వద్ద జైలర్ (24) అనే బిహార్‌కు చెందిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. గుల్బర్గాకు చెందిన సలీం ఈ హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 17, 2026
హైదరాబాద్ గడ్డపై ప్రపంచ ప్యాకేజింగ్ ‘దంగల్’

64 ఏళ్ల ఐసీసీఏ (ICCA) చరిత్రలో తొలిసారి HYDకు గ్లోబల్ సమ్మిట్ ఆతిథ్యం దక్కింది. 2027 జనవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్‌తో తెలంగాణ పేరు గ్లోబల్ ఇండస్ట్రియల్ మ్యాప్‌లో మారుమోగిపోనుంది. రూ.55 వేల కోట్ల విలువైన దేశీ ప్యాకేజింగ్ రంగానికి ఈ సదస్సు ఊపిరి పోయనుంది. హైదరాబాద్ దిగ్గజాలు ఎం.ఎల్. అగర్వాల్, అంకిత్ అగర్వాల్ సారథ్యంలో ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం. రేపు కర్టెన్ రైజర్ ఈవెంట్ జరుగుతోంది.
News February 17, 2026
రికార్డుల వేట.. ఎగవేతదారుల కోటలకు బీట!

సెల్ఫ్ అసెస్‌మెంట్ పేరుతో ఆస్తి పన్ను లెక్కల్లో మాయాజాలం చేసిన వారికి కాలం చెల్లింది. అద్దె విలువను (ARV) తక్కువ చూపిస్తూ పన్ను ఎగ్గొట్టే బడా బాబుల గుట్టు రట్టు చేసేందుకు సర్కార్ ‘డిజిటల్ అస్త్రాన్ని’ ప్రయోగించింది. ఇంటి పన్ను పత్రం, కరెంటు మీటర్, రిజిస్ట్రేషన్ డేటా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఇళ్లు అని చెప్పి సాఫ్ట్‌వేర్ ఆఫీసులు, హాస్టళ్లు నడిపేవారికి కరెంటు బిల్లులే సాక్ష్యంగా మారుతున్నాయి.
News February 17, 2026
HYDలో రాజకీయ నేతలు ‘డబుల్ గేమ్’

HYDలో ఆస్తి పన్ను పెంచాలంటే సర్కారుకు చెమటలు పడుతున్నాయి. ARV పెంచుతూ మున్సిపల్ శాఖ నోటీసులు ఇస్తుంటే యజమానులు ‘స్టాండర్డ్ రెంట్’ సాకుతో కోర్టు మెట్లెక్కుతున్నారు. అద్దె నియంత్రణ చట్టం ప్రకారం పాత అద్దెలనే ప్రామాణికంగా తీసుకోవాలని, ఇష్టానుసారం పన్ను వేయకూడదని యజమానుల వాదన. ఏటా వందల రూ.కోట్ల వసూళ్లు నిలిచిపోతున్నాయి. ఓటర్లను నొప్పించలేక ఇటు ఖజానా నింపుకోలేక రాజకీయ నేతలు ‘డబుల్ గేమ్’ ఆడుతున్నారు.


