News November 20, 2025

హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచిన KTR‌: సబిత

image

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగిందని మాజీ మంత్రి, మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ప్రతి పక్షాన్ని, ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం CM రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా-ఈ రేసులను నిర్వహించి హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచిన KTR‌పై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమని ఆమె అన్నారు.

Similar News

News January 18, 2026

HYDలో ఆదివారం AQ @189

image

HYDలో ఎయిర్ క్వాలిటీ గత వారంతో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ నగరంలో ఆదివారం తెల్లవారుజామున 189గా నమోదైంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ తగ్గడంతో HYD ఊపిరితీసుకుంటోంది.

News January 18, 2026

HYD మెట్రో.. త్వరలో సీఎం ముందుకు ఫైనాన్స్ రిపోర్ట్..?

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన ఆడిట్ పూర్తిచేసినట్లు సమాచారం. మరో పది రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను సీఎం వద్దకు పంపనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో రైల్ హక్కుల స్వాధీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏదేమైనా ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని సర్కార్ భావిస్తోంది.

News January 18, 2026

HYDలో విమానాల న్యూమాయిష్.. ఎక్కడంటే..?

image

నగరం మరో ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈనెల 28 నుంచి నాలుగు రోజుల పాటు విమానాల ప్రదర్శన నిర్వహించనున్నారు. వింగ్స్ ఇండియా పేరిట నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ కంపెనీలు తమ విమానాలను ప్రదర్శననున్నాయి. మొదటి రెండు రోజులు బిజినెస్ పీపుల్‌కు, తరువాతి రెండు రోజులు సిటీ ప్రజలకు విమానాలను చూసే అవకాశం ఇవ్వనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఈ విమానాల ఎగ్జిబిషన్ ఉంటుంది.