News September 13, 2025

హైదరాబాద్‌ చుట్టూ మూడు రైల్వే టెర్మినల్స్‌

image

హైదరాబాద్ చుట్టూ కొత్తగా మూడు రైల్వే టెర్మినల్స్‌ను నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఈ టెర్మినల్స్ నిర్మాణం చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించింది. ఈ వివరాలను రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Similar News

News December 15, 2025

ఇది తమిళనాడు.. తలవంచబోం: స్టాలిన్

image

తమ తర్వాతి టార్గెట్ తమిళనాడేనని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ BJP ఎప్పటికీ గెలవలేదన్నారు. ‘ఇది తమిళనాడు. మా క్యారెక్టర్‌ను మీరు అర్థం చేసుకోలేరు. ప్రేమతో వస్తే ఆలింగనం చేసుకుంటాం. అహంకారంతో వస్తే తలవంచం. మిమ్మల్ని నేరుగా ఎదుర్కొని ఓడిస్తాం’ అని స్పష్టం చేశారు. BJP గెలవలేని ఏకైక రాష్ట్రం తమిళనాడు అని, అందుకే అమిత్ షా చిరాకు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

News December 15, 2025

దేశంలోనే తొలిసారి.. భోగాపురంలో

image

దేశంలోనే మొదటి ఏవియేషన్-ఏరోస్పేస్-డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సమీపంలో GMR మాన్సాస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఎడ్యుసిటీని మంత్రులు లోకేశ్, రామ్మోహన్ ఈనెల 16న విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో ప్రారంభిస్తారు. విమానయాన, రక్షణ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలకు అనుగుణంగా యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఉద్దేశం.

News December 15, 2025

కొత్తకోట: గతంలో ఒక్క ఓటు ఓటమి.. 839 మెజారిటీతో గెలుపు

image

గతంలో కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన లక్ష్మిదేవి మాసన్న ఈసారి అప్పరాల సర్పంచ్‌గా భారీ మెజార్టీతో మాసన్న గెలుపొందారు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాసన్న స్థానిక ప్రత్యర్థి పై 839 భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో పలువురు గ్రామ నాయకులు వారికి అభినందనలు తెలిపారు.