News April 25, 2024
హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

> ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
> జగద్గిరిగుట్టలో రౌడీషీటర్ అరెస్ట్
> మాదాపూర్‌లో డీజిల్ స్మగ్లింగ్
> ఓయూ PHD కోర్స్ వర్క్ పరీక్షలు వాయిదా
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం
> ఇంటర్ ఫెయిల్.. పలువురు విద్యార్థులు ఆత్మహత్య
> బాలికపై బైక్ మెకానిక్ అత్యాచారం
> నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన దానం, మాధవి లత, రాగిడి
Similar News
News April 16, 2026
HYD: BREAKING.. మంగ్లీ కేసులో రమావత్ మధు అరెస్ట్

మైక్రో ఫైనాన్స్ మోసాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మధుపై సైబరాబాద్ పరిధిలోని పలు PSలలో మోసపూరిత కేసులు నమోదు కాగా, తాజా అరెస్టుతో దర్యాప్తులో మరింత వేగం పుంజుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మధును పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో మంగ్లీ సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
News April 16, 2026
HYD: ‘హౌస్ వైరింగ్’.. FREE ట్రైనింగ్

చిలుకూరులోని SBI- RSETI నిరుద్యోగ యువతకు ‘హౌస్ వైరింగ్’లో ఉచిత శిక్షణ ఇస్తోంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన 18- 50 ఏళ్లలోపు వారు ఈ కోర్సుకు అర్హులు. ఉచిత భోజనం, వసతి, ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తారు. ఆధార్, రేషన్‌కార్డ్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.
News April 16, 2026
TG DEECET దరఖాస్తులు.. EDITకు ఛాన్స్

TG DEECET- 2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. MAR 15 నుంచి APR 15 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 17, 18వ తేదీల్లో వెబ్‌సైట్ ద్వారా సవరించుకోవచ్చు. సందేహాల నివృత్తికి 8317567404 నంబర్‌ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు. SHARE IT.


