News November 27, 2024
హైదరాబాద్: సెల్ ఫోన్ డ్రైవింగ్.. యముడి పిలుపు!
రోడ్డు ప్రమాదాల నివారణకు HYD పోలీసులు నడుం బిగించారు. ఎప్పటికప్పుడు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. CYB, HYD, రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లలో నిత్యం సూచనలు చేస్తున్నారు. తాజాగా రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై ఫోకస్ పెట్టారు. ‘సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. బహుశ అది యముడి పిలుపు కావొచ్చు’ అని పంజాగుట్టలో ఉన్న ఓ బోర్డు ఆలోచింపజేస్తోంది. Follow Traffic Rules.
Share it
Similar News
News December 13, 2024
HYD: జూ పార్క్ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం
సచివాలయంలో జూపార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి కొండా సురేఖ నిర్వహించారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ (హెచ్ఎఎఫ్ఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలుసింగ్ మేరు, సీసీఎఫ్లు ప్రియాంక వర్గీస్, భీమా నాయక్, రామలింగం, డైరక్టర్ జూ పార్క్స్ సునీల్ ఎస్, హేరామత్, అధికారులు పాల్గొన్నారు.
News December 13, 2024
HYD: రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు: SHO
కొట్టుకుంటే ఇద్దరిలో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. కానీ రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని నానుడి. వివిధ కేసుల్లో కక్షిదారులుగా ఉన్నవారు రేపు జరిగే నేషనల్ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసులను రాజీ చేసుకోగలరని హయత్‌నగర్ SHO నాగరాజు గౌడ్ సూచించారు. నేషనల్ లోక్ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవడానికి ఎలాంటి ఖర్చు ఉండదన్నారు.
News December 13, 2024
HYD: అగ్నివీర్ల ట్రైనింగ్‌పై ప్రశంసలు
సికింద్రాబాద్ EME కేంద్రాన్ని సీనియర్ కల్నల్ కమాండెంట్ సిదాన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్‌లను పరిశీలించారు. అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, బేసిక్ స్టాండర్డ్స్ మిలిటరీ ట్రైనింగ్, అగ్ని వీర్లకు అందిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో వివిధ స్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.