News July 3, 2024

హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ఏటా పెరుగుతోన్న నష్టాలు!

image

రాష్ట్రంలో అత్యధిక నష్టాల్లో ఉన్న హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42.23 శాతం నష్టాలొచ్చాయి. 1013 మిలియన్ యూనిట్లు ‘లాస్ యూనిట్లు’గా టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. 101 కోట్ల యూనిట్లు బిల్లింగ్‌లోకి రాలేదు. సగటు యూనిట్ ఖర్చు రూ.7 కాగా ఒక్క ఏడాదిలో రూ.707 కోట్లు ఖజానాకు గండిపడింది. దీంతో ఈ సర్కిల్‌ను ప్రైవేటుకు అప్పగించేందుకు సర్కారు సన్నద్ధం అవుతోంది.

Similar News

News December 12, 2025

HYD: ఫ్యాషన్‌ మార్కెట్‌ను శాసిస్తోన్న Gen Z

image

ఇకపై ‘కొక్వెట్‌ బో’లు, మాస్ ట్రెండ్‌లకు చోటు లేదు. ఇప్పుడు ఫ్యాషన్‌ మార్కెట్‌ను ‘జిన్-జడ్’ (Gen Z) శాసిస్తోంది. వీరు Y2K క్లిప్‌లను ఎథ్నిక్ బ్లౌజ్‌లు, సంప్రదాయ చేనేత దుస్తులను జెండర్-న్యూట్రల్‌గా ధరిస్తున్నారు. AR try-ons టెక్నాలజీతో ఆన్‌లైన్ షాపింగ్‌ చేస్తూ, సెకండ్‌ హ్యాండ్‌ దుకాణాలను జల్లెడ పడుతున్నారు. సొంతంగా ఎవరికీ తెలియని ‘అన్‌రిపీటబుల్’ స్టైల్ సృష్టించుకోవడమే నేటి ట్రెండ్.

News December 12, 2025

ఖైరతాబాద్: 19 నుంచి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

image

మహానగరం మరో భారీ కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 19 నుంచి సిటీలో HYD ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు ఉంటాయి. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. యూరప్, అమెరికా తదితర సినిమాలు ఇందులో ప్రదర్శిస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు.

News December 12, 2025

నగరంలో TTD క్యాలెండర్లు, డైరీల విక్రయం

image

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలతో అందంగా రూపొందించిన క్యాలెండర్లు, డైరీలు ఇపుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయాల్లో వీటితో పాటు శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉన్నాయని TTD అధికారులు తెలిపారు. క్యాలెండర్లు రూ.130, రూ.75, డైరీలు రూ.150, రూ.120కు విక్రయిస్తున్నారు. భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.