News January 18, 2026

హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్

image

DRDOకు చెందిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech 7, 8వ సెమిస్టర్, MTech ఫస్ట్ ఇయర్/ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

Similar News

News February 17, 2026

రికార్డులు సక్రమంగా నిర్వహించాలి: డీఎంహెచ్‌వో

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తుకారం రాథోడ్ మంగళవారం ఇల్లందు పట్టణంలోని పల్లె దవాఖాన ఉప కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వైద్య రికార్డులను పరిశీలించి, ఆరోగ్య సూచికలు మెరుగుపరిచేలా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గుండాల, రొంపేడు, కొమరారం తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎంపీహెచ్‌ఏ (స్త్రీ) సిబ్బందితో సమీక్ష నిర్వహించి, వైద్య సేవలు ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.

News February 17, 2026

మళ్లీ పెళ్లికి సిద్ధం: మమతా మోహన్ దాస్

image

మరోసారి ప్రేమలో పడేందుకు, పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని హీరోయిన్ మమతా మోహన్‌దాస్ వెల్లడించారు. అందుకు తగిన వ్యక్తి దొరకాలని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2011లో బిజినెస్‌మ్యాన్ ప్రేజిత్‌తో ఆమె వివాహం జరగగా ఏడాదికే విడిపోయారు. ‘ప్రేజిత్‌ను ఓ పెళ్లిలో మళ్లీ కలిశా. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా అనిపించాయి. మళ్లీ మనం పెళ్లి ఎందుకు చేసుకోకూడదని అడిగాడు. వెళ్లి మా నాన్నతో మాట్లాడమని చెప్పా’ అని తెలిపారు.

News February 17, 2026

వేరుశనగలో మొవ్వు కుళ్లు వైరస్ – నివారణ

image

మొవ్వు కుళ్లు వైరస్ సోకిన వేరుశనగ మొక్కల ఆకులపై తొలుత పచ్చని పాలిపోయిన వలయాలు ఏర్పడతాయి. పత్రహరితం పలచగా మారి మచ్చలు కనిపిస్తాయి. మొక్క మొవ్వు నల్లగా మారి ఎండిపోతుంది. మొక్కలు గిడసబారి, గుబురుగా ఉండి చిన్నచిన్న ఆకులు మెలితిరిగి ఉంటాయి. తెగులు సోకిన మొక్కల నుంచి వచ్చిన కాయ, విత్తనాలు చిన్నవిగా ఉంటాయి. తెగులు నివారణకు పంట 30 రోజులప్పుడు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.