News February 6, 2025
హోంమంత్రి అనితకి 20వ ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అనకాపల్లి జిల్లా మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనితకు 20వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.
Similar News
News January 23, 2026
పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులు: లోకేశ్

AP: ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్‌కు రాష్ట్రం గమ్యస్థానమని మంత్రి లోకేశ్ తెలిపారు. APకి 160GW పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉందన్నారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ-గ్లోబలైజేషన్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులుగా మారాయని తెలిపారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకుంటే డేటా సెంటర్లు, AI కంప్యూట్ రంగాలను విస్తరించలేమని దావోస్ రెన్యూ పవర్ మీటింగ్‌లో చెప్పారు.
News January 23, 2026
హనుమకొండ: కొడుకులు సాకడం లేదని ఊరికి ఆస్తి రాసిచ్చేశాడు

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్‌పేట గ్రామంలో ఓ వ్యక్తి తన భూమిని గ్రామపంచాయతీకి దానం చేశారు. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన పురోహితులు నాగిళ్ల వెంకటేశ్వర్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు. ముసలి ప్రాయంలో ఉన్న తనను ఏ కొడుకు కూడా పట్టించుకోవడం లేదని, తన బాగోగులు గ్రామస్థులు చూసుకుంటున్నందుకు తన పేరిట ఉన్న 4.38 ఎకరాల భూమిని గ్రామానికి దానం చేస్తున్నట్లు గ్రామపెద్దల సమక్షంలో రాసిచ్చారు.
News January 23, 2026
DRDOలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


