News June 17, 2024

హోం మంత్రి అనిత స్వీట్ వార్నింగ్

image

కొంతమంది పోలీసు అధికారులు YCP ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేశారని <<13455722>>హోం మంత్రి<<>> అనిత విమర్శించారు. వారిలో ఇప్పటికీ వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమన్న ఆమె.. సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News January 23, 2026

నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా భద్రత, గంజాయి రవాణా అడ్డుకట్ట, సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతికత వాడకంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నగర DCPలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News January 22, 2026

ఈ నెల 29న విడుదల కానున్న ఏపీ మత్స్యకారులు

image

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.

News January 22, 2026

ఏయూలో పాలన గాడి తప్పిందా?

image

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌‌ను ఏయూకి వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే వీసీ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను కలుపుకొని ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఈడీ విద్యార్థి మృతి, వీసీని నేరుగా కలవొద్దంటూ సర్క్యులర్లు, తాజాగా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు మెస్‌లో భోజనం నిలిపివేయడంతో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.