News November 19, 2025
హోటల్ రూమ్‌లకు భలే డిమాండ్

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తుండటంతో పుట్టపర్తిలో లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. రూ.5 వేలు పెట్టినా రూములు దొరకడం లేదు. అయితే, ట్రస్ట్ తరఫున 50 వేల మందికి సరిపడేలా వసతి షెడ్లు ఏర్పాటు చేసి, మూడు పూటలా భోజన సౌకర్యం కల్పించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉతచి బస్సులు ఏర్పాటు చేశారు. దేవభూమి ఆధ్యాత్మక శోభతో వెలుగొందుతోంది.
Similar News
News January 14, 2026
NRPT: పట్టాదారు పాసుపుస్తకాల జారీలో జాప్యం

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల జారీ తీవ్రంగా ఆలస్యమవుతోంది. భూమి రిజిస్ట్రేషన్ చేసి 9 నెలలు గడుస్తున్నా పాసుపుస్తకాలు అందకపోవడంతో రైతులు, కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాసుపుస్తకం లేక బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మీసేవలో ఛార్జీలు వసూలు చేస్తున్నా సేవలు సకాలంలో అందడం లేదని, గతంలో ధరణి పోర్టల్ ద్వారా త్వరగా పాసుపుస్తకాలు వచ్చేవని రైతులు అంటున్నారు.
News January 14, 2026
NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్‌లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
News January 14, 2026
పాలక్ పనీర్ తంటా: ఇండియన్ స్టూడెంట్స్‌కు ₹1.80 కోట్ల పరిహారం

USలోని కొలరాడో వర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ Ph.D విద్యార్థులు ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య న్యాయపోరాటంలో నెగ్గారు. క్యాంపస్‌లో 2023లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న టైమ్‌లో సిబ్బంది ఆ వాసనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి వారి డిగ్రీలను నిలిపివేసే వరకు వెళ్లడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వర్సిటీ వారికి దాదాపు ₹1.80 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది.


