News November 19, 2025

హోటల్‌ రూమ్‌లకు భలే డిమాండ్‌

image

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తుండటంతో పుట్టపర్తిలో లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. రూ.5 వేలు పెట్టినా రూములు దొరకడం లేదు. అయితే, ట్రస్ట్ తరఫున 50 వేల మందికి సరిపడేలా వసతి షెడ్లు ఏర్పాటు చేసి, మూడు పూటలా భోజన సౌకర్యం కల్పించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉతచి బస్సులు ఏర్పాటు చేశారు. దేవభూమి ఆధ్యాత్మక శోభతో వెలుగొందుతోంది.

Similar News

News January 23, 2026

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 11 మంది సీఐల బదిలీ

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో పని చేస్తున్న 11 మంది సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 అదనపు డీజీపీ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ట్రాఫిక్ సీఐగా ఉన్న భగవంత రెడ్డిని మరికల్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.

News January 23, 2026

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

image

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ 769.67 పాయింట్లు క్షీణించి 81,537.70 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 241.25 పాయింట్లు పడిపోయి 25,048.65కు దిగజారింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (Indigo), సిప్లా వంటి షేర్లు భారీగా నష్ట పోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, ONGC వంటివి కొంత మేర లాభాల్లో నిలిచాయి.

News January 23, 2026

మల్యాల: తండ్రిపై బండ రాయితో కొడుకు దాడి

image

మల్యాల కేంద్రానికి చెందిన పెరుమండ్ల సత్యనారాయణ (54)పై కొడుకు మనోజ్ బండరాయితో దాడికి పాల్పడ్డాడు. సత్యనారాయణకు ఇద్దరు భార్యలు కాగా, పెద్ద భార్య రుద్రంగిలో పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే శుక్రవారం తండ్రి దగ్గరకు వచ్చిన మనోజ్ మద్యం మత్తులో బండరాయితో తలపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న సత్యనారాయణను స్థానికులు 108లో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.