News December 8, 2025

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికో..?

image

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు బరిలో ఉన్నారు. కొత్త జిల్లాలో పార్టీ బలం పెంపు దిశగా సరైన నేతకు అధిష్ఠానం అవకాశం కల్పించాలని నాయకులు ఆశాజనకంగా ఎదురుచూస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం దరఖాస్తు చేసిన అభ్యర్థులపై సమగ్ర సర్వే నిర్వహించినట్లు సమాచారం.

Similar News

News December 9, 2025

హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్ వీడియో వైరల్.. తప్పెవరిది?

image

హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్, మోడల్ మహికాశర్మ వీడియో ఒకటి SMలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించే ఫొటోగ్రాఫర్లపై హార్దిక్ <<18512560>>మండిపడ్డారు<<>>. హద్దుమీరి ఫొటోలు తీసే ముంబై కెమెరామెన్ల(పపరాజీ)పై గతంలో కొందరు సెలబ్రిటీలు ఆగ్రహించారు. వారి గురించి తెలిసి కూడా లోదుస్తులు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం ఎందుకని కొందరు నెటిజన్లు మహికాను ప్రశ్నిస్తున్నారు. ఇష్టమైన డ్రెస్ వేసుకోవడం తప్పా అని మరికొందరు ఆమెకు మద్దతిస్తున్నారు.

News December 9, 2025

KNR కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

image

కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 104 క్లస్టర్లలో పెట్రోలింగ్‌తో పాటు, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

News December 9, 2025

ములుగు: తగ్గుముఖం పట్టిన అవినీతి!

image

జిల్లాలో అవినీతి నిరోధక శాఖ పనితీరుతో అవినీతి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2025లో నేటి వరకు కేవలం 2 కేసులు నమోదయ్యాయి. జిల్లా పంచాయతీ శాఖ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, డీఈవో, జూనియర్ అసిస్టెంట్లు ఏసీబీ ట్రాప్‌లో పడ్డారు. దీంతో జిల్లాలో వివిధ శాఖలకు చెందిన అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
# నేడు ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం.