News November 29, 2025
అగార్కర్‌తోనూ చర్చలు జరపనున్న బీసీసీఐ!

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ పదవికి ఎలాంటి ప్రమాదం లేదని BCCI చెప్పినట్లు వార్తలొచ్చాయి. అటు చీఫ్ సెలక్టర్ అగార్కర్‌పై కూడా ట్రోలింగ్ జరిగింది. సెలక్షన్ కమిటీ నిర్ణయాలే వైఫల్యానికి కారణమంటూ విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే టెస్టుల్లో టీమ్ ఇండియా ప్రదర్శనపై అగార్కర్ బృందంతోనూ BCCI చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 2, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు

హైదరాబాద్ <
News December 2, 2025
దిత్వా తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News December 2, 2025
థియేటర్లలో రొమాన్స్.. టెలిగ్రామ్‌లో వీడియోలు

థియేటర్లలో జంటలు సన్నిహితంగా ఉండే వీడియోలు టెలిగ్రామ్, Xలో దర్శనమివ్వడం కేరళలో కలకలం రేపింది. అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే థియేటర్లలో CCTV ఫుటేజీలు హ్యాక్ అయ్యాయి. సరైన సెక్యూరిటీ నెట్‌వర్క్ వ్యవస్థ లేకపోవడంతో ఈజీగా హ్యాక్ అయినట్లు నిపుణులు తెలిపారు. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్, బలమైన నెట్‌వర్క్, సరైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. థియేటర్లలో సన్నిహితంగా ఉండొద్దని చెబుతున్నారు.


