News November 14, 2025

అడిషనల్ జడ్జ్‌గా క్షమా దేశ్‌పాండే బాధ్యతలు

image

వరంగల్ జిల్లాకు SPE, ఏసీబీ(ACB) కేసుల స్పెషల్ కోర్టులో అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జ్‌గా బాధ్యతలు చేపట్టిన క్షమా దేశ్‌పాండేను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డి.మురళీధర్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు ఆకారం శ్రీనివాస్ కుమార్, కోశాధికారి రాజేశ్ కుమార్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.

Similar News

News November 15, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

NLG : డీసీసీబీలో సహకార వారోత్సవాలు
మిర్యాలగూడ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
NLG : చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి
NLG : వెటర్నరీ ఆసుపత్రిలో మందుల కొరత
NLG : చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు
NLG : 17 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
NLG : పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో మార్పులు
NLG : యాసంగి ప్రణాళిక @ 6,57,229 ఎకరాలు
చిట్యాల : నల్లగొండ పోలీసుల సూపర్

News November 15, 2025

‘ప్రతి ఒక్కరూ మధుమేహ పరిక్షలు చేయించుకోవాలి’

image

ప్రతి ఒక్కరూ మధుమేహ పరిక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్సులిన్ కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జన్మదినాన్ని ప్రపంచ మధుమేహ దినోత్సవంగా నిర్వహిస్తారన్నారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ విజయమ్మ, డీఈఓ పురుషోత్తం తదితర అధికారులు ఉన్నారు.

News November 15, 2025

బిహార్‌లో ‘నిమో’ డబుల్ సెంచరీ

image

బిహార్‌లో ఎన్నికల్లో నిమో(నితీశ్-మోదీ) ఆధ్వర్యంలోని NDA డబుల్ సెంచరీ కొట్టింది. 243 స్థానాలకు గానూ 203 సీట్లు కైవసం చేసుకుంది. BJP 90 స్థానాల్లో, JDU 85 చోట్ల, LJP 19 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. HAM-5, RLM-4 సీట్లు కైవసం చేసుకున్నాయి. అటు కాంగ్రెస్-RJD నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ ఇప్పటివరకు 34 సీట్లకే పరిమితం అయింది. ఆర్జేడీ 24, INC-6 సీట్లు గెలుచుకున్నాయి.