News November 14, 2025
అనధికార షాపులను తొలగించాలి: ఈవో వెంకట్రావు

యాదాద్రి ఆలయ పరిసరాల్లో ప్రైవేట్ ప్రకటనలు, ఫ్లెక్సీలను, అనధికారిక షాపులను నిషేధించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఆలయ భూములు కబ్జాకు గురికాకుండా కాంపౌండ్ వాల్, బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని, దుకాణాల వద్ద ధరల వివరాలు తప్పక ఉంచాలని స్పష్టం చేశారు. సేవాభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News November 14, 2025
కృష్ణా: 30 మంది జెడ్పీ ఉద్యోగులకు పోస్టింగ్

గత 6 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జెడ్పీ ఉద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు వారికి పోస్టింగ్‌లు ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జూన్‌లో జెడ్పీ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. కౌన్సిలింగ్ ద్వారా 30 మంది ఉద్యోగులు జెడ్పీకి వచ్చారు. అయితే వీరికి సీట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు వీరందరికీ ఉన్నతాధికారులు సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 14, 2025
సెంచరీకి 5 ఓటముల దూరంలో రాహుల్: బీజేపీ సెటైర్లు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలపడటంపై BJP సెటైర్లు వేసింది. ఎన్నికల ఓటములకు చిహ్నంగా రాహుల్ మారారని విమర్శించింది. 2004 నుంచి ఇప్పటిదాకా 95 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని ఓ మ్యాప్‌ను షేర్ చేసింది. సెంచరీకి 5 ఓటముల దూరంలో ఉన్నారని ఎద్దేవా చేసింది. ‘మరో ఎన్నిక, మరో ఓటమి! ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే.. మొత్తం రాహుల్‌కే వస్తాయి’ అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
News November 14, 2025
NHIDCLలో ఉద్యోగాలు

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NHIDCL) 6 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్స్ మెయిన్స్- 2024 రాసి ఇంటర్వ్యూకు ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34 ఏళ్లు. సివిల్స్ మెయిన్స్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/


