News November 19, 2025

అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

image

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్‌ఛార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా నియమించారు.

Similar News

News December 9, 2025

మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..

image

TG: దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ ఈ నెల 13న HYDలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆ రోజు 4PMకు ఆయన HYD చేరుకొని ఓ హోటల్‌లో రెస్ట్ తీసుకుంటారు. రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లి సీఎం రేవంత్ టీంతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో ఇంటరాక్షన్ ఉండనుంది. అనంతరం పరేడ్, మెస్సీకి సన్మానం నిర్వహించనున్నారు. దాదాపు 2గంటల పర్యటన తర్వాత మెస్సీ అదే రోజు తిరుగు పయనమవుతారు.

News December 9, 2025

గొర్రె, మేక పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.

News December 9, 2025

పంచాయతీ ఎన్నికల్లో వారే అధికం!

image

TG: జీపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం 1,66,48,496 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించగా అందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఇతరుల సంఖ్య 500గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 3.50 లక్షలు అధికం. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో(11, 14, 17) పోలింగ్ కోసం 1,12,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది.