News November 14, 2025

అన్నమయ్య: 20 ఎర్రచందనం దుంగలు.. ఇన్నోవా సీజ్

image

అన్నమయ్య జిల్లాలోని శేషచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన వీరబల్లి మండలం తాటిగుంటపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. కాగా పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించి 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారని రేంజర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. దుంగలు, వాహనం విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని రేంజర్ తెలిపారు.

Similar News

News November 14, 2025

హత్య కేసులో జైలుకు.. MLAగా విజయం

image

హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న NDA అభ్యర్థి, జేడీ(యూ) నేత అనంత్ కుమార్ సింగ్ MLAగా విజయం సాధించారు. బిహార్ మోకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28,206 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జన్ సురాజ్ పార్టీ పోల్ వర్కర్ దులార్ చంద్ యాదవ్‌ మర్డర్ కేసులో నవంబర్ 2న అరెస్టయ్యారు. అనంత్ కుమార్ సింగ్‌కు 91,416, వీణా దేవికి 63,210 ఓట్లు దక్కాయి.

News November 14, 2025

నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలి: DM&HO

image

మాతా శిశు సేవల ద్వారా గర్భిణులను గుర్తించి సకాలంలో రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. మాతా శిశువులకు నిర్ధేశించిన సమయానికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలని సూచించారు. ఈనెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జాతీయ నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలన్నారు.

News November 14, 2025

18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: CBN

image

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు CII సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్స్ రాబట్టగలిగామని వివరించారు. అటు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ గ్రూప్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం CBN, లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.