News November 12, 2025

అభివృద్ధి ప‌థంలో ప‌ర్యాట‌క రంగం కీల‌కం: కలెక్టర్

image

స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ సాకారానికి స‌మ్మిళిత‌, సుస్థిర ఆర్థిక వృద్ధి ముఖ్య‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా అన్నారు. క‌లెక్ట‌ర్ బుధ‌వారం ట్రెయినీ ఐఏఎస్ అధికారుల‌తో క‌లిసి కొండ‌ప‌ల్లి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. వారికి ఖిల్లా చారిత్ర‌క వైభ‌వాన్ని వివ‌రించారు. కొండ‌ప‌ల్లి కోట‌ను ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి చేసేందుకు చొర‌వ తీసుకుంటున్నామ‌ని వివరించారు.

Similar News

News November 12, 2025

అండ దానం గురించి తెలుసా?

image

వయసు పైబడిన మహిళలు, పదే పదే ఐ.వి.ఎఫ్‌లు ఫెయిల్‌ అయిన వాళ్లకు అండాల అవసరం ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్‌ రిప్రొడక్టివ్‌ బ్యాంకుల నుంచి మాత్రమే అండాలను తీసుకోవలసి ఉంటుంది. గతంలో ఏ మహిళైనా, ఎన్నిసార్లైనా తమ అండాలను అమ్ముకోగలిగే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు 23 నుంచి 35 ఏళ్ల మహిళలు మాత్రమే ఎగ్‌ డొనేషన్‌కు అర్హులు. అలాగే ఒక మహిళ తన జీవిత కాలంలో, కేవలం ఒక్కసారి మాత్రమే అండాలను డొనేట్‌ చేయాలి.

News November 12, 2025

చింతూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

చింతూరు (M) తుమ్మలలో బుధవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు SI రమేష్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. చింతూరు-భద్రాచలం వైపు బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డు‌పై పడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా శివకృష్ణ మృతి చెందాడు. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చెరువుపల్లికి చెందిన శివకృష్ణగా గుర్తించారు.

News November 12, 2025

విద్యార్థిని అభినందించిన మంత్రి దుర్గేష్

image

నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ)కి ఇటీవల ఎంపికైంది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ..కుంచాల కైవల్య రెడ్డిని అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులను నిడదవోలు టౌన్ రోటరీ ఆడిటోరియంలో బుధవారం కలిశారు.