News November 2, 2025
అల్లూరి: మొదటి రోజు 94.88% పెన్షన్ పంపిణీ పూర్తి

అల్లూరి జిల్లాలో మొదటి రోజైన శనివారం 94.88% పెన్షన్ పంపిణీ పూర్తయిందని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 22 మండలాల్లో 1,22,306 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.51,51,80,000 మంజూరైందన్నారు. శనివారం రాత్రి పంపిణీ ముగిసే సమయానికి 1,16,039 మందికి రూ.48,78,87,500 పంపిణీ చేశామన్నారు. మిగిలిన 6,267 మందికి పెన్షన్ పంపిణీ జరుగుతుందన్నారు.
Similar News
News November 2, 2025
తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 2, 2025
కదిరిలో 30 మందిపై రౌడీ షీట్లు నమోదు

హత్య, హత్యాయత్నం, గంజాయి అమ్మకాలు వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థులపై కదిరి టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఆదేశాలతో 30మందిపై రౌడీషీట్లు నమోదు చేసినట్లు కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. తీవ్రమైన నేరాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముగ్గురిపై PD చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు చెప్పారు.
News November 2, 2025
డిప్యూటీ సీఎం పరిగి పర్యటన వాయిదా

పరిగి నియోజకవర్గంలో జరగాల్సిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. ముందుగా సోమవారం జరగాల్సిన ఈ పర్యటన ఇప్పుడు బుధవారానికి జరుగనుంది. పరిగి పరిధిలో 400 KV, ఆరు 33/11 KV సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేసి, నజీరాబాద్ తండాలో 220 KV సబ్‌స్టేషన్ ప్రారంభించి, రూ.8 కోట్లు విలువైన వ్యవసాయ విద్యుత్ సామగ్రిని పంపిణీ చేసి, ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.


